ఎప్పుడూ టెన్షన్ గా అనిపిస్తుందా.. ఈ చిట్కాలు పాటిస్తే మాత్రం అద్భుతమైన లాభాలు!

ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామం, తగినంత నిద్ర, సమతుల్య ఆహారం, ధ్యానం, మరియు ఇతరులతో మాట్లాడటం వంటివి సహాయపడతాయి, అలాగే నవ్వడం, ప్రకృతిలో సమయం గడపడం కూడా మంచి మార్గాలని చెప్పవచ్చు. నడవడం, జాగింగ్, నృత్యం లేదా ఈత వంటి వ్యాయామాలు మానసిక స్థితిని మెరుగుపరిచే విషయంలో ఎంతగానో తోడ్పడతాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలు అధికంగా ఉండే ఆహారం కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ 6 నుంచి 8 గంటలు నిద్రపోవడం ద్వారా ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశాలు అయితే ఉంటాయని కచ్చితంగా చెప్పవచ్చు. యోగా, మైండ్‌ఫుల్‌నెస్ లేదా శ్వాస వ్యాయామాలు మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి.

స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మీ భావాలను పంచుకోవడం ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. చిత్రలేఖనము, సంగీతం మరియు ఇతర సృజనాత్మక కార్యక్రమాలు ఒత్తిడిని తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి. పచ్చదనం చూసి, ప్రశాంతంగా ఉండటం కూడా ఒత్తిడిని తగ్గించడంలో తోడ్పడుతుంది. తరచూ నవ్వడం ద్వారా కూడా ఒత్తిడిని అధిగమించవచ్చు.

సామర్థ్యానికి మించి పని చేయడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ విధంగా చేయడం వల్ల నష్టాలు చేకూరుతాయి. పనులను వాయిదా వేయడం కూడా ఏ మాత్రం మంచిది కాదు. ఈ అలవాటును మార్చుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాలు చేకూరుతాయి. ఎప్పుడూ టెన్షన్ గా అనిపిస్తుంటే ఆ టెన్షన్ వల్ల జీవన శైలి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. తరచూ టెన్షన్ పడే వాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.