జ్వరం, తలనొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలు ఎలాంటి సంకోచం లేకుండా అందరికీ చెప్పుకోవడానికి ఇష్టపడతామనే సంగతి తెలిసిందే. మలద్వారం దగ్గర ఎదురయ్యే ఈ సమస్య మనుషుల్ని కుర్చోనివ్వదు, నిల్చోనివ్వదు, నడవనివ్వదని చెప్పవచ్చు.
ఆయుర్వేదం శరీరంలో వాత, పిత్త, కఫ అనే మూడు దోషాలు ఉంటాయి. వీటిని త్రిదోషాలు అని పిలుస్తారు. ఈ త్రిదోషాలు కలుషితం అయితే శరీరం పనితీరు దెబ్బ తినే ఛాన్స్ ఉంద్ది.. త్రిదోషాలలో వాతం, కఫం ఎక్కువైతే డ్రై ఫైల్స్ సమస్య వస్తుందని చెప్పవచ్చు. త్రిదోషాలలో ఒకటైన పిత్త దోషం ఎక్కువైతే అది రక్త మొలలకు దారి తీస్తుందని చెప్పవచ్చు. ఆయుర్వేదం చెప్పిన కొన్ని టిప్స్ పాటిస్తే మొలల సమస్య తగ్గుతుంది.
కలబంద చాలామంది ఇళ్ల దగ్గర అలంకరణ కోసం పెంచుతుంటారనే సంగతి తెలిసిందే. అయితే ఇది మొలల సమస్యకు చెక్ పెడుతుందని చెప్పవచ్చు. తాజా కలబంద గుజ్జు తింటూ ఉంటే ఫైల్స్ సమస్య నయం అయ్యే అవకాశాలు ఉంటాయి. కలబంద జ్యూస్ లేదా తాజా తలబంద గుజ్జు తినడం వల్ల బాహ్య మొలలు, అంతర్గత మొలలు రెండూ కూడా నయం అవుతాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ఇది మొలల సమస్యను తగ్గించడమే కాకుండా ప్రేగు కదలికలు కూడా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని చెప్పవచ్చు..
పైల్స్ సమస్యకు జీలకర్ర, సోపు కూడా చక్కగా పని చేసే అవకాశాలుంటాయి.. ముఖ్యంగా రక్తపు మొలల సమస్య తగ్గడానికి జీలకర్ర ప్రభావవంతంగా పని చేస్తుందని చెప్పవచ్కు.. జీలకర్ర వేయించి పంచదారతో కలిపి మెత్తని చూర్ణంగా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. దీన్ని 1 నుండి 2 గ్రాముల పరిమాణంలో రోజుకు 2 నుండి 3 సార్లు తింటే మంచిది. అదే విధంగా జీలకర్రను మజ్జిగలో కలిపి తీసుకోవాలి. మొలల సమస్య తొందరగానే తగ్గిపోతుందని చెప్పవచ్చు.