నెలకు రూ.లక్ష వేతనంతో 74 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. అత్యంత భారీ వేతనంతో?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తీపికబురు అందించింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 74 కన్సల్టెంట్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 2023 సంవత్సరం అక్టోబర్ 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా కన్సల్టెంట్ ఎ, కన్సల్టెంట్ బి, కన్సల్టెంట్ సి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. కన్సల్టెంట్ ఎ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 60,000 రూపాయల వేతనం లభించనుండగా కన్సల్టెంట్ బి ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ. 80,000 వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. కన్సల్టెంట్ సి ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు లక్ష రూపాయల వేతనం లభించనుంది.

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుండగా వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు భారతదేశంలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుంది.

2023 సంవత్సరం సెప్టెంబర్ 20 దరఖాస్తు ప్రారంభ తేదీ కాగా 2023 సంవత్సరం అక్టోబర్ 31వ తేదీ దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతుండగా ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే ప్రయోజనం చేకూరనుంది.