డిగ్రీ, పీజీ అర్హతతో అకౌంట్స్, మార్కెటింగ్ ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

ఈ మధ్య కాలంలో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా భారీ స్థాయిలో జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతూ ఉండగా ఈ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఎంతగానో మేలు జరుగుతోంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తాజాగా మరో తీపికబురు అందించింది. మొత్తం 93 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని సమాచారం అందుతోంది.

cotcorp.org.in అధికారిక పోర్టల్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, మేనేజ్‌మెంట్ ట్రైనీ(మార్కెటింగ్), మేనేజ్‌మెంట్ ట్రైనీ(అకౌంట్స్) ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం.

ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలుగా ఉండగా మిగతా అభ్యర్థులకు మాత్రం దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉండనుంది. 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు.

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ లేదా అగ్రికల్చర్ ఫీల్డ్‌లో ఎంబీఏ చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.