మనలో సాధారణంగా ఎవరికైనా జ్వరం ఏడాదికి ఒకటి లేదా రెండుసార్లు వస్తుంది. పదేపదే జ్వరం వేధిస్తుంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు. పదేపదే జ్వరం వస్తుందంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణ శరీర ఉష్ణోగ్రత 98.6 డిగ్రీల ఫారెన్‌హీట్ కాగా ఈ ఉష్ణోగ్రత 100.4 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే దానిని జ్వరం అంటారు.
5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో తరచూ జ్వరం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సాధారణంగా పగటిపూట వ్యాయామం చేస్తే శరీర ఉష్ణోగ్రత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ను చూపించడంతో పాటు జన్యుపరమైన లోపాల వల్ల కూడా ఈ సిండ్రోమ్ వచ్చే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు.
వైరస్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, టీకా వల్ల కూడా జ్వరం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. చిన్నపిల్లలకు ఎక్కువగా జ్వరం వస్తుంటే శ్వాస తీరునుపై అప్రమత్తం అయితే మంచిది. పిల్లలకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పిల్లల జ్వరం 5 రోజుల కంటే ఎక్కువగా ఉంటే డాక్టర్ ను సంప్రదించాలి. జ్వరం ఎంతకాలం, ఎన్ని రోజులు కొనసాగిందో జాగ్రత్తగా చెక్ చేసుకుంటే బాగుంటుంది.
పదేపదే జ్వరం వస్తుంటే అన్ని రకాల పరీక్షలు చేయించుకుని చికిత్స చేయించుకోవాలి. జ్వరం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏ మాత్రం మంచిది కాదని చెప్పవచ్చు. జ్వరం దీర్ఘకాలికంగా ఎన్నో సమస్యలను క్రియేట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.