కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అప్రెంటిస్‌షిప్ మరియు మేనేజర్ ఉద్యోగ ఖాళీల కోసం భారీ జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 332 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అప్రెంటిస్‌షిప్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లు అక్టోబర్ 4వ తేదీలోగా దరఖాస్తులను పంపాల్సి ఉండగా మేనేజర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లు అక్టోబర్ 8వ తేదీలోగా దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఖాళీలను పరిశీలిస్తే ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ ఉద్యోగ ఖాళీలు 300 ఉండగా టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ఉద్యోగ ఖాళీలు 8, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు 12, డిప్యూటీ మేనేజర్ 1, మేనేజర్ 8, సీనియర్ మేనేజర్ 1, అసిస్టెంట్ మేనేజర్ 2 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. వేర్వేరు ఉద్యోగ ఖాళీలకు వేర్వేరు వయోపరిమితులు ఉన్న నేపథ్యంలో అర్హతల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.
ఈ ఉద్యోగ ఖాళీలలో కొన్ని ఉద్యోగ ఖాళీలకు అనుభవం ఉన్న ఉద్యోగులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీగా వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. అర్హత, అనుభవం ఉన్నవాళ్లకు ఈ ఉద్యోగ ఖాళీల వల్ల ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరుతుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు జరుగుతుంది.
వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులు సంతోషిస్తున్నారు. షిప్ యార్డ్ లో జాబ్ కావాలని భావించే వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలపై దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు. ఇంటర్, ఐటీఐ, గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే భారీ స్థాయిలో బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు.