నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. భారీ సంఖ్యలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగ ఖాళీలు!

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగ ఖాళీల కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 836 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి నెల 20వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. cisf.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

జనరల్ కేటగిరీ అభ్యర్థుల కోసం 649 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఇతర కేటగిరీల అభ్యర్థులకు మిగతా పోస్టులు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు.

రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, వైద్య పరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుండగా అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఎక్కువ మొత్తం వేతనం లభిస్తున్న నేపథ్యంలో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగానే ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది.