మీ పిల్లలు మట్టి, సుద్ద తింటున్నారా.. ఈ చిట్కాలు పాటిస్తే ఆ సమస్యలు దూరం!

తల్లీదండ్రులు చిన్నపిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాలనే సంగతి తెలిసిందే. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లలు మట్టి, సుద్ద లేదా గోడ స్క్రాప్‌లను తినడం వల్ల వాళ్లను ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది. వీటిని తినడం వల్ల పిల్లలకు ఎలాంటి పోషకాలు లభించవనే సంగతి తెలిసిందే.

ఎవరైతే ఎక్కువగా వీటిని తింటారో వారిలో కాల్షియం, ఐరన్, జింక్ మొదలైన మూలకాల లోపం ఏర్పడటంతో పాటు కొత్త ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. సరైన పోషకాలు అందని పిల్లలు ఎక్కువగా మట్టి, బలపాలు తింటారు. వీటిని తినడం వల్ల పిల్లలకు కడుపులో పురుగులు, నొప్పులు, ఇన్ఫెక్షన్లు లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

పిల్లలు తరచూ మట్టి, సుద్ద, తినకూడని వస్తువులను తింటూ ఉంటే వాళ్లకు అరటి పండ్లను అలవాటు చేయాలి. అరటిపండ్లలో ఐరన్, కాల్షియం, కార్బోహైడ్రేట్, ఫైబర్, ప్రొటీన్ పుష్కలంగా ఉంటాయి. శరీరంలో కాల్షియం లోపిస్తే పిల్లలకు బీన్స్, ఆకుపచ్చ కూరగాయలను తినిపించడం ద్వారా కాల్షియం లోపాన్ని దూరం చేయవచ్చు. డైటీషియన్ సలహాల ప్రకారం పిల్లలకు ఆహారం ఇస్తే కూడా ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.

పిల్లలకు లవంగం నీటిని ఇవ్వడం ద్వారా వాళ్లు మట్టి తినే అలవాటును దూరం చేసుకుంటారు. 4 నుంచి 6 లవంగాలను నీటిలో మరిగించి ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. పిల్లలకు వంశ్లోచన్ తినిపించడం ద్వారా కూడా మట్టి తినే అలవాటును దూరం చేయవచ్చు. అయితే వైద్యుల సలహా మేరకు మాత్రమే పిల్లలకు వంశ్లోచన ఇవ్వాలి. వైద్య నిపుణుల సలహాలను తీసుకోవడం ద్వారా కూడా ఈ సమస్యలను అధిగమించవచ్చు.