కేంద్రం అదిరిపోయే తీపికబురు.. సులువుగా ఖాతాలో రూ.2.50 లక్షలు పొందే ఛాన్స్!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఆ స్కీమ్స్ లో ప్రధానమంత్రి ఆవాస యోజన స్కీమ్ కూడా ఒకటి. రేషన్ కార్డ్ కలిగి ఉండి సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ స్కీమ్ కు సంబంధించి లోన్ కూడా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

450 చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణంలో గృహాలను నిర్మించే వాళ్లు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. క్యాస్ట్ సర్టిఫికెట్ జిరాక్స్, ఇన్ కమ్ జిరాక్స్, రేషన్ కార్డ్ జిరాక్స్, ఇతర సర్టిఫికెట్ల జిరాక్స్ లకు సబ్మిట్ చేయడం ద్వారా ఈ స్కీమ్ ప్రయోజనాలు పొందవచ్చు. లోన్ పొందిన ఏడాదిన్నరలోగా ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.

భారత్‌లో పేద ప్రజలకు పక్కా ఇళ్లు నిర్మించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2015 సంవత్సరం నుంచి ఈ స్కీమ్ ను అమలు చేస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే సొంత ఇంటిని కలిగి ఉన్నవాళ్లు ఈ స్కీమ్ బెనిఫిట్ ను పొందే అవకాశం ఉండదు. మన దేశానికి చెందిన వాళ్లు మాత్రమే ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లక్షన్నర రూపాయలు నేరుగా బ్యాంక్ లోకి వస్తుంది.

మిగిలిన మొత్తాన్ని సబ్సిడీ లోన్ కింద తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆధార్ కార్డు, ఇన్‌కం సర్టిఫికెట్, వయసు ధ్రువీకరణ పత్రం, అడ్రస్ ప్రూఫ్, మొబైల్ నంబర్, బ్యాంక్ పాస్‌బుక్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో సహాయంతో సులువుగా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.