ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన ఇఫ్ కో నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఈ సంస్థలో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ ద్వారా ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. బీఎస్సీ(అగ్రికల్చర్) కనీసం 60 శాతం మార్కులతో పాసైన జనరల్, ఓబీసీ అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 2023 సంవత్సరం ఆగష్టు 1వ తేదీ నాటికి వయస్సు 30 సంవత్సరాల లోపు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రిలిమినరీ కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్, మెడికల్ టెస్ట్, ఫైనల్ ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇతర పరీక్షల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ పూర్తి కానుంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ మాత్రమే పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు శిక్షణ సమయంలో నెలకు రూ.33,000 స్టైపెండ్ లభించే అవకాశం ఉంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు మాత్రం రూ.37,000 -రూ.70,000 వేతనంతో పాటు ఇతర ఆలవెన్స్ లు లభించే అవకాశాలు ఉంటాయి. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. 2023 సంవత్సరం అక్టోబర్ 7వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది.