ఎల్ఐసీ సూపర్ పాలసీ.. తక్కువ పెట్టుబడితో ఏకంగా 110 శాతం రాబడి పొందే ఛాన్స్!

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను అమలు చేస్తుండగా ఈ పాలసీలలో భాగ్య లక్ష్మి యోజన పాలసీ కూడా ఒకటి. ఈ పాలసీ మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్ కాగా తక్కువ ఆదాయం పొందేవాళ్లకు ఈ పాలసీ బెస్ట్ పాలసీ అవుతుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ తీసుకున్న వాళ్లకు ఎలాంటి జీఎస్టీ వర్తించదు. ఈ పాలసీ తీసుకుంటే ప్రీమియంపై టర్మ్ ఇన్సూరెన్స్ తో పాటు మెచ్యూరిటీపై 110 శాతం డిపాజిట్‌ను తిరిగి పొందే ఛాన్స్ ఉంటుంది.

ఈ పాలసీ పెట్టుబడి, పొదుపు, బీమా పాలసీ కాగా ఈ పాలసీ తీసుకుంటే ప్రీమియంలో మొత్తం 110 శాతం చెల్లింపును పొందే అవకాశం అయితే ఉంటుంది. పాలసీదారు మరణిస్తే అతనిపై ఆధారపడిన వాళ్లు ఈ మొత్తాన్ని పొందవచ్చు. కనీస హామీ 20000 రూపాయల నుంచి గరిష్టంగా 50000 రూపాయల వరకు ఈ పాలసీ తీసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

15 సంవత్సరాల పాలసీ తీసుకుంటే 13 సంవత్సరాలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షికంగా లేదా ఏకమొత్తంలో ప్రీమియంను చెల్లించే అవకాశం అయితే ఉంటుంది. కనీసం ఏడేళ్ల నుంచి గరిష్టంగా 15 సంవత్సరాల కాలపరిమితితో ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. 18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీ తీసుకోవచ్చు.

ఈ పాలసీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో బెనిఫిట్స్ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కనీస ఆదాయం ఉన్నవాళ్లు సైతం ఈ పాలసీని సులువుగా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎల్.ఐ.సీ ఏజెంట్ లేదా ఎల్.ఐ.సీ బ్రాంచ్ ద్వారా ఈ పాలసీని తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.