కేంద్రం సూపర్ స్కీమ్.. విద్యార్థులకు ఫ్రీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్‌ పొందే ఛాన్స్!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో అద్భుతమైన స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పేద మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం చేకూర్చాలనే ఆలోచనతో కేంద్రం ఈ స్కీమ్స్ ను అమలు చేస్తోంది. అన్ని వర్గాలకు చదువుకునే ఛాన్స్ లభించేలా మోదీ సర్కార్ అడుగులు పడుతున్నాయి. భారతదేశంలోని షెడ్యూల్డ్ కులాల విద్యను ప్రోత్సహించాలనే ఆలోచనతో కేంద్రం శాఖ శ్రేష్ట అనే స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం.

స్కీమ్‌ ఫర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఫర్‌ స్టూడెంట్స్‌ ఇన్‌ హై స్కూల్స్‌ ఇన్‌ టార్గెటెడ్‌ ఏరియాస్ పథకం వల్ల ఉన్నత-నాణ్యత విద్య, సమగ్ర అభివృద్ధి అవకాశాలు లభించే అవకాశాలు ఉంటాయి. ఎస్సీ విద్యార్థులను శక్తి వంతులను చేయడంతో పాటు విద్యా అంతరాన్ని తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేస్తుండటం గమనార్హం. నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్‌ శ్రేష్ట ద్వారా ప్రతిభావంతులైన ఎస్సీ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.

ఈ పరీక్షలలో మంచి ఫలితాలను సాధించిన విద్యార్థులు ఉత్తమ ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 9వ తరగతి లేదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది. 2.5 లక్షల రూపాయల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబ సభ్యులను చెందిన విద్యార్థులు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటూ యువతకు ఎంతో మేలు చేస్తోంది.

కేంద్రం స్కీమ్స్ గురించి పూర్తిస్థాయిలో అవగాహన ఉన్నవాళ్లు ఈ స్కీమ్స్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో పాటు స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. ఈ పథకం ఎంపిక చేసిన పాఠశాలల్లోనే ఒక బ్రిడ్జ్ కోర్సు కూడా ఉంటుందని బోగట్టా. పాఠశాల ఫీజులు, రెసిడెన్షియల్ ఛార్జీలను కవర్ చేయడానికి గ్రాంట్లు కేటాయించడంతో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతోంది.