సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. భారీ వేతనంతో?

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్ మెంట్, సెంట్రల్ ఆఫీస్ లలో రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు పడుతున్నాయి. ఆన్ లైన్ ద్వారా ఇందుకు సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ నెల 3వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండటం గమనార్హం. మొత్తం 253 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగ ఖాళీలలో ఎస్సీ పోస్టులు 37 ఉండగా ఎస్టీ పోస్టులు 18, ఓబీసీ పోస్టులు 68, ఈడబ్ల్యూఎస్ పోస్టులు 25, జనరల్ ఉద్యోగ ఖాళీలు 105 ఉన్నాయి. జావా డెవలపర్, మొబైల్ డెవలపర్, కోబాల్ డెవలపర్, డాట్ నెట్ డెవలపర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, డేటా ఇంజినీర్, డేటా సైంటిస్ట్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఐటీ ఆఫీసర్స్ ఇతర ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి.

సంబంధిత డిగ్రీలో బ్యాచిలర్స్ ఉత్తీర్ణతతో పాటు బీఈ, బీటెక్, ఎంసీఏ, డిప్లొమా పాస్ కావడంతో పాటు పని అనుభవం ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్నా వాళ్లకు పోస్టును బట్టి వయో పరిమితులు ఉంటాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఒకింత భారీ వేతనం లభించనుందని సమాచారం అందుతోంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు ముంబై, నవీ ముంబై, హైదరాబాద్ లలో పని చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 175 రూపాయలు జీఎస్టీ దరఖాస్తు ఫీజుగా ఉండగా జనరల్, ఇతర అభ్యర్థులకు 850 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉండనుందని సమాచారం అందుతోంది.