పదో తరగతి అర్హతతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురుచూసే వాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. సబ్ స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 484 శానిటేషన్ వర్కర్ల సబ్ స్టాఫ్ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. centralbankofindia.co.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.

2024 సంవత్సరం జనవరి నెల వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పదో తరగతి లేదా సమానమైన పరీక్ష పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2023 సంవత్సరం మార్చి 31 నాటికి 26 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

దరఖాస్తు రుసుము అభ్యర్థుల కేటగిరీని బట్టి మారే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు జీఎస్టీతో కలిపి 175 రూపాయలుగా ఉంటుంది. మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 850 రూపాయలుగా ఉంది. ఆన్‌లైన్ పరీక్ష, స్థానిక భాషా పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. జనవరి/ఫిబ్రవరి 2024లో జనవరి/ఫిబ్రవరి 2024లో ఈ ఉద్యోగాలకు సంబంధించిన భాషా పరీక్షను షెడ్యూల్ చేశారు.

అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లకు వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఎక్కువ వేతనం లభించనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో మేలు జరగడంతో పాటు ప్రయోజనం చేకూరనుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ ఖాళీలకు అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.