పదో తరగతి అర్హతతో భారీ సంఖ్యలో బ్యాంక్ ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

మన దేశంలో చాలామంది బ్యాంక్ ఉద్యోగం కోసం కలలు కంటున్నారు. ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్ ఉద్యోగ ఖాళీల కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. పదో తరగతి పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

మొత్తం 484 ఉద్యోగ ఖాళీలు ఉండగా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి 10వ తరగతి లేదా దానికి సమానమైన పరీక్షలో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. స్థానిక భాషపై కూడా పరిజ్ఞానం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 26 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 28145 రూపాయల వరకు వేతనం లభించనుంది. ఆన్ లైన్ పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 175 రూపాయలుగా ఉంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన ఇతర అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 850 రూపాయలుగా ఉండనుందని సమాచారం అందుతోంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు జనవరి నెల 16వ తేదీ చివరి తేదీగా ఉంది. 2024 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పరీక్షను నిర్వహించడం జరుగుతుంది.