సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు.. మంచి వేతనంతో?

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1000 మేనేజర్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జులై 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది.

మేనేజర్ (మెయిన్ స్ట్రీమ్)-మిడిల్ మేనేజ్ మెంట్ గ్రేడ్ స్కేల్ – 2 కింద ఏకంగా 1000 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సీఏఐఐబీ ఉత్తీర్ణులు కావడంతో పాటు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. 32 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయి.

ఆఫీసర్ గా మూడేళ్ల అనుభవంతో పాటు క్లర్క్ గా కనీసం ఆరేళ్ల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 850 రూపాయలుగా ఉండనుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు మాత్రం దరఖాస్తు ఫీజు 175 రూపాయలుగా ఉండనుందని తెలుస్తోంది.

ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకింగ్, కంప్యూటర్ పరిజ్ఞానం, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి గురించి పూర్తిస్థాయిలో అవగాహనను కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వాళ్లు ఈ ఇంటర్వ్యూకు హాజరయ్యే ఛాన్స్ ఉంటుంది.

https://www.centralbankofindia.co.in/en వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ను పూరించడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్కాన్ చేసిన ఫోటోగ్రాఫ్‌లు మరియు సంతకాలను అప్‌లోడ్ చేసి దరఖాస్తుదారులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్ ను నింపిన తర్వాత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.