సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1000 ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?

ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ లలో ఒకటైన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 1,000 మేనేజర్ల పోస్టుల భర్తీకి ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ ii లో ఈ మేనేజర్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. centralbankofindia.co.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆగష్టు రెండో వారం లేదా మూడో వారంలో పరీక్షను నిర్వహిస్తారు. ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 2023 సంవత్సరం మే 31వ తేదీ నాటికి 32 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలని తెలుస్తోంది. రూరల్ బ్యాంకింగ్ లో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.

వాలంటరీ రిటైర్మెంట్ పొందిన వాళ్లు కూడా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆన్ లైన్ పరీక్ష పాసైన వాళ్లు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 850 రూపాయలు కాగా మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 175 రూపాయలుగా ఉంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు రూ.69,810 వేతనంగా లభిస్తుంది.

rdpunero@centralbank.co.in మెయిల్ ఐడీకి దరఖాస్తు ఫారమ్ తో పాటు ఇతర డాక్యుమెంట్లను పంపించాల్సి ఉంటుంది. భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతుండటంతో నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.