ఆడపిల్లల తల్లిదండ్రులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఏడాదికి లక్ష రూపాయలు పొందే అవకాశం..?

సమాజంలో పురుషులతోపాటు స్త్రీలకు కూడా అన్ని రంగాలలో ప్రభుత్వం సమాన హక్కులు కల్పిస్తోంది. మహిళల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి ఎన్నో పథకాలను అమలులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా ఆడపిల్లల బంగారు భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ఆడపిల్లలు ఎంతో లబ్ధి పొందుతున్నారు. ఇలా ఆడపిల్లల కోసం కేంద్ర ప్రవేశపెట్టిన ఉత్తమ పథకాలలో సుకన్య సమృద్ధి యోజన పథకం కూడా ఒకటి. ప్రపంచ మహిళా దినోత్సవం నేపథ్యంలో ఆ పథకం గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం మీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఆడపిల్లల తల్లిదండ్రులు పిల్లలను ఉన్నత చదువులు చదివించి, వివాహాలు చేయటానికి చింతించాల్సిన అవసరం లేదు. ఈ పథకంలో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో ఆడపిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆడపిల్లల తల్లిదండ్రులు సుకన్య సమృద్ధి పథకంలో పెట్టుబడి పెట్టటానికి బ్యాంకులు లేదా ఇండియా పోస్ట్ బ్రాంచ్‌లో పొదుపు ఖాతను తెరవవచ్చు. సుకన్య సమృద్ధి యోజన ఖాతాలకు 7.6 శాతం వడ్డీ వస్తుంది. మనం పెట్టిన పెట్టుబడి మీద లాభం ఆధారపడి ఉంటుంది.

అయితే ఈ పథకం ద్వారా లబ్ధి పొందటానికి భారత పౌరులకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఆడపిల్లల పేరు మీద డబ్బులు పొదుపు చేయటానికి సుకన్య సమృద్ధి యోజన స్కీం కింద అకౌంట్ ను ఓపెన్ చేసే సమయానికి అమ్మాయి వయస్సు పదేళ్లకు మించి ఉండరాదు. అలాగే సుకన్య సమృద్ధి యోజన ఖాతా కుటుంబంలోని ఇద్దరు ఆడపిల్లలకు మాత్రమే తెరుస్తారు. సుకన్య పథకంలో అకౌంట్ తీసుకోవాలంటే కనీస మొత్తం రూ.250తో ఖాతా ప్రారంభించాలి. గరిష్టంగా ఏడాదికి రూ.1.5 లక్షల వరకూ ఈ ఖాతా దాచుకోవచ్చు. ఉదాహరణకు మీరు పది సంత్సరాల కాలనికి 7.6 శాతం వడ్డీరేటుతో నెలకు రూ.8333 పెట్టుబడి పెడితే అది సంవత్సరానికి రూ. లక్ష అవుతంది. అయితే మెచ్యూర్ అయ్యాక వడ్డీతో కలిపి రూ.15,29,458 లాభాన్ని మీరు పొందవచ్చు.