ప్రస్తుత కాలంలో యువతలో చాలామంది బీటెక్ చదవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇంజనీరింగ్ చదివితే ఎక్కువ మొత్తం వేతనం పొందే అవకాశం ఉండటంతో పాటు సాఫ్ట్ వేర్ రంగంలో సులువుగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చాలామంది భావిస్తున్నారు. ఐటీ రంగంలో ఈ మధ్య కాలంలో లే ఆఫ్స్ వల్ల కొంతమంది జాబ్స్ కోల్పోతున్నా ప్రతిభ ఉన్నవాళ్లకు మాత్రం తిరుగుండదని ఇప్పటికే చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది.
సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ అడ్వాన్డ్స్ కంప్యూటింగ్ ఇంజనీరింగ్ పాసైన వాళ్లకు అదిరిపోయే తీపికబురును అందించింది. 857 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదల కాగా ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలగనుందని చెప్పవచ్చు.
దేశంలోని వేర్వేరు ప్రాంతాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా సీడాక్-హైదరాబాద్‌లో 56 ఉద్యోగ ఖాళీలు, సీడాక్ -బెంగళూరులో 83 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని సమాచారం అందుతోంది. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగ ఖాళీలకు పీహెచ్‌డీ డిగ్రీని కలిగి ఉన్నవాళ్లు అర్హత కలిగి ఉంటారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది.
ఆగష్టు నెల 16వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు కాగా అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీగా వేతనం లభించనుందని తెలుస్తోంది.