సీడీఏసీలో 325 ఉద్యోగ ఖాళీలు.. నెలకు ఏకంగా రూ.55000 కంటే ఎక్కువ వేతనంతో?

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగ ఖాళీలతో పాటు ఇతర ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండటం గమనార్హం. cdac.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.

ఫిబ్రవరి నెల 20వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉందని తెలుస్తోంది. జూనియర్ ఫీల్డ్ అప్లికేషన్ ఇంజనీర్ పోస్టులు 45 ఉండగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగ ఖాళీలు 75 ఉన్నాయి. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆఫీసర్ జాబ్స్ 75 ఉండగా ప్రాజెక్ట్ మేనేజర్/ప్రోగ్రామ్ జాబ్స్ 15 ఉన్నాయి. ప్రాజెక్ట్ ఆఫీసర్ జాబ్స్ 3 ఉండగా ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఫైనాన్స్) జాబ్ 1 ఉంది.

ప్రాజెక్ట్ ఆఫీసర్ (అవుట్‌రీచ్ మరియు ప్లేస్‌మెంట్) 1 ఉండగా ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ (హాస్పిటాలిటీ) 1 ఉంది. ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ 1 ఉండగా ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ (లాజిస్టిక్స్ & ఇన్వెంటరీ) 1 ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలతో పాటు ఇతర ఉద్యోగ ఖాళీలు సైతం ఉన్నాయి. అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన సంబంధిత విద్యార్హతల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

ఉద్యోగ ఖాళీల ఆధారంగా వయో పరిమితిలో తేడాలు ఉండగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఎక్కువ మొత్తం వేతనం లభించే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు 55,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం వేతనం లభించే అవకాశాలు అయితే ఉంటాయి.