పొద్దున లేవగానే టీ తాగడం చాలా మందికి అలవాటు.. ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు అది వారి జీవితంలో ప్రత్యేకమైన భాగం. ముఖ్యంగా ఇలాచీ టీ (Elaichi Tea) దాని వినూత్న వాసన, రుచితో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంది. కొందరు స్ట్రాంగ్ టీ అంటే ఇష్టపడితే, ఇంకొందరు మసాలా టీ, అల్లం టీ, ఇలాచీ టీకి ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే ఈ టీ ఆరోగ్యకరమైనదిగా ప్రసిద్ధి పొంది ఉన్నప్పటికీ, అందరికీ ఇది సురక్షితమని చెప్పలేం.
గాల్బ్లాడర్ స్టోన్స్ (పిత్తాశయ రాళ్లు) ఉన్నవారు ఇలాచీ టీ తాగడాన్ని తక్కువగా చేయాలి. ఈ టీ గాల్బ్లాడర్లోని రాళ్లను ఇరిటేట్ చేయడం వల్ల నొప్పి పెరగడానికి అవకాశమే ఎక్కువ. మీకు ఈ సమస్య ఉంటే డాక్టర్ సలహా తీసుకోకుండా తాగడం మంచిది కాదు అని నిపుణులు అంటున్నారు. ఈ సంస్థితిలో సాధారణ టీ లేదా హెర్బల్ టీనే ఉత్తమ మని చెబుతున్నారు. ప్రెగ్నెంట్స్, పాలిచ్చే తల్లులు కూడా యాలకులను అధికంగా తాగకూడదని అంటున్నారు. గర్భధారణ సమయంలో ఈ మసాలా పదార్థాల వల్ల గర్భస్రావం రిస్క్ పెరుగుతుందని చెబుతున్నారు. పాలు ఇచ్చే తల్లులకు కూడా పరిమిత స్థాయిలోనే వాడటం ఉత్తమమంట.
అలర్జీ ఉన్నవారు ఖచ్చితంగా ఈ టీకి దూరంగా ఉండాలి. యాలకులు శరీరానికి ఎదురు అయినప్పుడు స్కిన్ రాషెస్, దురద, శ్వాస సమస్యలు రావొచ్చు. వ్యత్యాసమైన మార్పులు కన్పించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇక డయాబెటిస్ ఉన్నవారు యాలకుల టీ తాగేటప్పుడు జాగ్రత్త వహించాలి. యాలకులు బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గించే శక్తి కలిగి ఉన్నాయి. అయితే పరిధికి మించి తాగితే, మందులతో కలిపి హైపోగ్లైసీమియా అనే ప్రమాదకర స్థితి రావచ్చు. కనుక షుగర్ మందులు వాడుతున్నవారు దీనిని తక్కువ మోతాదులో స్వీకరించాలి.
బ్లడ్ థిన్నర్ ఔషధాలు వాడుతున్నవారు కూడా ఇలాచీ టీ తాగడంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. యాలకులు సహజ రీతిలో బ్లడ్ థిన్నింగ్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ నియంత్రణలతో కలిపి తాగితే జిగురు సమస్యలు, బ్లీడ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. మెడికేషన్స్ తీసుకునే వారు ఎలాంటి మసాలా దినుసులు తీసుకునే ముందు డాక్టర్ తప్పనిసరిగా సంప్రదించాలి.
ఇలాచీ టీ అంటే ఇష్టమే కానీ ఎవరైనా నిర్లక్ష్యంగా తరచూ తాగడం వల్ల కొన్ని ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అలాగే అధికంగా తాగినప్పుడు గ్యాస్, నాజియా, డయేరియా, డిజినెస్ వంటి సమస్యలు రావచ్చు. వాస్తవానికి ఆరోగ్యకరంగా ఉండాలంటే పరిమితంగా, శరీర పరిస్థితిని బట్టి, వైద్యుని సలహాతోనే టీని తాగడం మంచిదని నిపుణులు అంటున్నారు. ఇల్లలో టీ వాసన చూస్తే ఎవరికైనా తాగాలి అనిపిస్తుంది.. కానీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని టీ తాగడం ఉత్తమమని అంటున్నారు.
