ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం ఆహార పద్ధతులలో మార్పులు రావడం వల్ల చుండ్రు సమస్య వేధిస్తోంది. స్త్రీ పురుషులని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సమస్యతో సతమతమవుతున్నారు. చుండ్రు సమస్య నుండి విముక్తి పొందటానికి మార్కెట్లో లభించే వివిధ రకాల షాంపులను ఉపయోగిస్తూ ఉంటారు.వీటిని వాడటం వల్ల చుండ్రు సమస్య తగ్గటం అటుఉంచితే ఇతర సమస్యలు మొదలవుతాయి. అయితే మన ఇంట్లో ఉండే రెండు రకాల వస్తువులను ఉపయోగించి ఈ చిట్కాలు పాటిస్తే ఈ చుండ్రు సమస్యకు పులిస్టాప్ పెట్టవచ్చు.
అందరి ఇళ్లల్లో ఉల్లిపాయ తప్పనిసరిగా ఉంటుంది. అలాగే బంగాళదుంపలు కూడా ఇంట్లో తప్పనిసరిగా ఉంటాయి. ఈ రెండింటినీ ఉపయోగించి చుండు సమస్యకు పరిష్కారం చెప్పవచ్చు. చుండ్రు సమస్యతో బాధపడేవారు ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేయాలి . ఆ తర్వాత మీడియం సైజు బంగాళదుంపని కూడా ముక్కలుగా చేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఒక మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ని ఒక బట్టలో వేసి దీని నుండి జ్యూస్ తీయాలి. ఇలా తీసిన ఉల్లిపాయ బంగాళదుంప జ్యూస్ ని ఒక స్ప్రే బాటిల్ లో వేసి స్కాల్ఫ్ కి అంటుకునేలా ఒకటికి రెండుసార్లు స్ప్రే చేయాలి.
ఆ తర్వాత తలకి క్యాప్ ధరించి రెండు గంటలపాటు అలాగే ఉంచుకోవాలి. రెండు గంటల తర్వాత తలని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా నెలకు రెండు సార్లు చేయటం వల్ల చుండ్రు సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఎక్కువగా చుండ్రు సమస్యతో బాధపడేవారు వారానికి ఒకసారి ఈ చిట్కా పాటించటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. ఈ చిట్కా పాటించటం వల్ల చుండ్రు సమస్య తగ్గిపోవడమే కాకుండా మళ్ళీ మళ్ళీ ఈ సమస్య దరిచేరకుండా ఉంటుంది. అయితే ఉల్లిపాయ బంగాళదుంప జ్యూస్ తలకి అంటించిన తర్వాత గోరువెచ్చని నీటితో తలని ఒకటికి రెండుసార్లు బాగా శుభ్రం చేసుకోవాలి. అప్పుడే చుండ్రు సమస్య పూర్తిగా దూరం అవుతుంది.