ఇంట్లో సువాసనలు వెదజల్లే రూమ్ ఫ్రెష్ నర్స్ మీరే సొంతంగా తయారు చేసుకోవచ్చు? ఎలాగంటే!

మనలో చాలామంది ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి నుంచి వచ్చే చెడు వాసనను తొలగించుకోవడానికి మార్కెట్లో దొరికే అనేక రకాల రూమ్ క్లీనర్స్, రూమ్ ఫ్రెష్ నర్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీనివల్ల చర్మ ఇన్ఫెక్షన్లు, శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయని అనేక సర్వేలో వెల్లడింది. దీనికి గల కారణాలను పరిశీలిస్తే రూమ్ క్లీనర్స్, రూమ్ ఫ్రెషనర్స్ లో ఉపయోగించే యాసిడ్ లాంటి రసాయనాల నుంచి వెలువడే ఘాటైన ఆవిరి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఇందులో ఉండే రసాయనాలు చేతులకు అంటినప్పుడు అనేక చర్మా అలర్జీలు, ఇన్ఫెక్షన్లను లకు కారణం అవుతాయి.

మన ఇంట్లో దొరికే సహజమైన కొన్ని పదార్థాలతో రూమ్ క్లీనర్స్, రూమ్ ఫ్రెషనర్స్ తయారు చేసుకుని ఉపయోగిస్తే సహజ పద్ధతిలో ఇంటి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవచ్చు. ఇంటి వాతావరణాన్ని సువాసన భరితంగా ప్రశాంతంగా ఉంచుకోవాలంటే మార్కెట్లో దొరికే రూమ్ ఫ్రెషనర్స్ కు బదులు మన ఇంట్లోనే రూమ్ ఫ్రెషనర్స్ తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా అరకప్పు టేబుల్ సాల్ట్ తీసుకుని అందులో కొన్ని గులాబీ రేకులను వేయాలి. తర్వాత అందులోకి ఒక స్పూన్ లావెండర్ ఆయిల్ లేదా ఆల్మండ్ ఆయిల్ మిక్స్ చేస్తే సహజ సిద్ధమైన రూమ్ ఫ్రెషనర్స్ సిద్ధమైనట్లే.

వాష్ బేసిన్ సింక్, టైల్స్ తొందరగా మరకలు పడి తెగ ఇబ్బంది పెడుతుంటాయి. వీటిని ఎల్లప్పుడూ సహజ పద్ధతిలో కొత్త దానిలా కనిపించేలా చేసుకోవాలంటే ఈ సింపుల్ చిట్కాను పాటించొచ్చు. దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. ఇందుకోసం నిమ్మరసంలో టేబుల్ సాల్ట్, బేకింగ్ సోడా వేసి సింకు లేదా టైల్స్ ను శుభ్రం చేస్తే సులువుగా మరకలు అన్ని తొలగిపోయి కొత్త దానిలా మెరుస్తూ కనిపిస్తుంది. ఆరంజ్ తొక్కలతో ఇంట్లో పరిమళాలు వెదజల్లవచ్చు అదెలాగంటే ఆరంజ్ తొక్కలపై టేబుల్ సాల్ట్ చల్లి ఓ మూలన ఉంచితే నిరంతరం సువాసనలు వెదజల్లుతూనే ఉంటుంది.