స్త్రీలు మొక్కుబడిగా దేవుళ్ళకు తలనీలాలు సమర్పించవచ్చా.. శాస్త్రం ఏం చెబుతోంది?

సాధారణంగా మనం ఏదైనా కోరికను కోరుకొని దేవుడికి మన తలనీలాలను సమర్పిస్తామని మొక్కుతూ ఉంటారు.ఇలా స్వామివారికి మొక్కిన మొక్కును తీర్చుకోవడానికి చాలామంది పెద్ద ఎత్తున దేవాలయాలకు వెళ్లి తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. ఇలా మహిళలు దేవుడికి మొక్కుబడిగా తలనీలాలను సమర్పించవచ్చా… ఈ విషయం గురించి శాస్త్రం ఏం చెబుతుంది అనే విషయానికి వస్తే…

శాస్త్రం ప్రకారం అమ్మాయి పుట్టిన తర్వాత తన తొలి వెంట్రుకలను కేశఖండనంగా తొలగిస్తారు.అబ్బాయి అయినా అమ్మాయి అయినా తొమ్మిదవ నెలలోనూ లేదా 11వ నెలలో ఇలా కేశఖండన కార్యక్రమాన్ని నిర్వహించి వారికి పుట్టు వెంట్రుకలను తొలగిస్తారు. ఇది మన ఆచార వ్యవహారంలో కూడా ఒక భాగమే. అయితే అబ్బాయిలు పెరిగి పెద్దయిన తర్వాత కూడా స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ గుండు చేయించుకుంటూ ఉంటారు కానీ అమ్మాయిలు మాత్రం అలా చేయించుకోకూడదని శాస్త్రం చెబుతోంది.

శాస్త్రం ప్రకారం అమ్మాయి పుట్టిన తర్వాత పుట్టు వెంట్రుకలను తీసిన అనంతరం మరోసారి తలనీలాలు సమర్పించకూడదని చెబుతోంది. ఇలా ఒక స్త్రీ ఎప్పుడు కూడా తలనీలాలను సమర్పించకూడదు తన భర్త మరణించిన సమయంలోనే తను ఇలా తలనీలాలు ఇవ్వచ్చు కానీ భర్త ఉన్న మహిళ పొరపాటున కూడా తలనీలాలను సమర్పించకూడదు. ఒకవేళ దేవుడికి మొక్కు చెల్లించుకోవాలి అంటే కేవలం మూడు కత్తెరలు మాత్రమే ఇస్తామని మొక్కుకోవాలి. ఇలా స్వామివారికి మొక్కు తీర్చుకోవాలి కానీ స్త్రీ ఎప్పుడూ కూడా తలనీలాలు సమర్పించకూడదని శాస్త్రం చెబుతోంది.