గర్భిణీ స్త్రీలు శృంగారంలో పాల్గొనవచ్చా… పాల్గొన్న ఎలాంటి ప్రమాదం ఉండదా?

శృంగారం అనేది ఇద్దరి మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.ఈ క్రమంలోనే శృంగారంలో పాల్గొనడానికి ఎంతో ఆసక్తి చూపుతుంటారు. అయితే మహిళల్లో ఒకసారి గర్భం దాల్చిన తర్వాత శృంగారంలో పాల్గొనడం వల్ల కడుపులో పెరిగే బిడ్డకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని ఆందోళన చెందుతుంటారు. ఇలా కడుపులో బిడ్డకు ఏదైనా ప్రమాదం కనుక జరిగితే పరిస్థితి ఏంటి అన్న ఆలోచనలతో ప్రెగ్నెన్సీగా ఉన్న సమయంలో నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా పూర్తిగా తమ భర్తలను దూరం పెడుతూ ఉంటారు. నిజంగానే గర్భిణీ స్త్రీలు శృంగారంలో పాల్గొనకూడదా నిపుణులు ఏం చెబుతున్నారు అనే విషయానికి వస్తే…

గర్భం దాల్చిన మహిళలు తమకు ఎలాంటి ఇబ్బంది కనక లేకపోతే నిస్సంకోచంగా శృంగారంలో పాల్గొనవచ్చునే నిపుణులు చెబుతున్నారు. గర్భం ధరించినప్పటి నుంచి డెలివరీకి ముందు వరకు అంటే తొమ్మిది నెలల్లోకి పడే వరకు కూడా శృంగారంలో పాల్గొనవచ్చు శృంగారంలో పాల్గొనడం వల్ల కడుపులో బిడ్డకు ఏ విధమైనటువంటి ప్రమాదం ఉండదని,ఇలా ప్రెగ్నెన్సీ సమయంలో కలయిక వల్ల కండరాల కదలిక కూడా మంచిగా ఉండే సాధారణ ప్రసవం జరిగే సూచనలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఇకపోతే ఎలా శృంగారంలో పాల్గొనేవారు ఒకటికి రెండుసార్లు వైద్యులు సలహా తీసుకొని పాల్గొనడం మంచిదే అయితే మహిళలు ఇదివరకు ఎవరికైనా అబార్షన్లు జరిగి ఉన్న,లేదా గర్భం ధరించిన సమయంలో ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు శృంగారానికి దూరంగా ఉండాలి. కొందరి మహిళలలో మావి కిందికి ఉంటుంది అలాంటివారు శృంగారంలో పాల్గొనడం వల్ల గర్భస్రావమయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా అనారోగ్య సమస్యలు ఉన్నవారు శృంగారంలో పాల్గొనకపోవడం మంచిది.