మాంసం తినకుండానే ఎముకలను స్ట్రాంగ్ చేసుకోవాలా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

ఎవరైతే మాంసం తింటారో వాళ్ల ఎముకలు బలంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. అయితే శాఖాహారులు ఎముకలను బలంగా ఉంచుకోవాలంటే కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా ఎముకలు బలంగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. బ్రకోలీ, క్యాబేజీ, బెండకాయ ఆకుకూరలు, సోయా బీన్స్, చేపలు, మాంసాహారం పాలు, చీజ్ తీసుకుంటే ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటాయి.

అరటిపండ్లు తినడం ద్వారా శరీరానికి అవసరమైన మెగ్నీషియం లభించడంతో పాటు ఎముకలకు సంబంధించిన సమస్యలు దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రతిరోజూ డైట్ లో అరటిపండును భాగం చేసుకుంటే మంచిది. కాల్షియం ఎక్కువగా ఉండే ఆకుకూరలలో బచ్చలికూర ఒకటి. ఉడకబెట్టిన బచ్చలికూరను తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్లు లభించే ఛాన్స్ ఉంటుంది.

నట్స్ తీసుకోవడం ద్వారా కూడా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. నట్స్ ద్వారా కాల్షియంతో పాటు శరీరానికి అవసరమైన మెగ్నీషియం, ఫాస్పరస్‌లు లభించే ఛాన్స్ ఉంటుంది. నట్స్ ను రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని చెప్పవచ్చు. పాలు, పెరుగు, చీజ్ వంటి ప్రోడక్ట్స్‌లో కాల్షియం పుష్కలంగా ఉండగా ప్రతిరోజూ పెరుగు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ ను తీసుకోవడం ద్వారా కూడా ఎముకలకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. క్రమం తప్పకుండా ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం ద్వారా ఎముకల సమస్యలు దూరమవుతాయి. ప్రతిరోజూ ఎండలో నడవడం ద్వారా ఎముకలకు సంబంధించిన సమస్యలు దూరం కావడంతో పాటు శరీరానికి అవసరమైన విటమిన్ డి అందుతుందని చెప్పవచ్చు.