ఇన్సూరెన్స్ పాలసీలను కొనుగోలు చేసేవాళ్లకు అలర్ట్.. చెయ్యకూడని తప్పులివే!

insurance3-kFkF--621x414@LiveMint

మనలో చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. అయితే ఈ పాలసీ వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీఇన్నీకావు. హెల్త్ ఇసూరెన్స్ పాలసీ తీసుకోవడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా బయటపడవచ్చు. అయితే పెద్దగా పాపులారిటీ లేని సంస్థల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేస్తే మాత్రం ఊహించని స్థయిలో నష్టపోయే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

 

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకునే వాళ్లు మన అవసరాలకు అనుగుణంగా పాలసీలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ మొత్తం కవరేజ్ ఉండేలా ఈ పాలసీలను తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఇప్పటికే ఆఫీస్ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా మరో పాలసీని తీసుకుంటే ఎలాంటి నష్టం ఉండదు. ఫ్యామిలీ అవసరాలకు అనుగుణంగా పాలసీలను ఎంచుకుంటే ఎక్కువ మొత్తం బెనిఫిట్స్ లభిస్తాయి.

 

వయస్సు, మెడికల్ హిస్టరీ ఆధారంగా ప్రీమియంలలో కూడా మార్పులు ఉంటాయి. సంబంధిత బ్రాంచ్ రివ్యూలను సైతం పరిగణనలోకి తీసుకుని పాలసీలను ఎంచుకుంటే మంచిదని చెప్పవచ్చు. సరైన పాలసీలను ఎంచుకుంటే మాత్రమే ఎక్కువ మొత్తంలో బెనిఫిట్స్ లభించే అవకాశాలు అయితే ఉంటాయి. చెల్లించే ప్రీమియంతో పాటు ప్రయోజనాలను సైతం పరిగణనలోకి తీసుకోవాలి.

 

రివార్డ్ లను అందించే పాలసీలను ఎవరైనా ఎంచుకుంటే వాళ్లు దీర్ఘకాలంలో భారీ స్థాయిలో బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పాలసీని తీసుకునే సమయంలో షరతులను గుర్తుంచుకోవాలి. క్లయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌, కస్టమర్ సర్వీస్‌ ఆధారంగా పాలసీలను తీసుకుంటే మంచిది.