కొత్త కారు కొంటున్నారా…. ఈ విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిందే!

కారు కొనడం అనేది ప్రతి ఒక్కరి కల. ఈ క్రమంలోనే చాలామంది కారును కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే కారు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా కొన్ని విషయాలను ఒకటికి రెండుసార్లు ఆలోచించి కారును కొనుగోలు చేయాలి. ఈ క్రమంలోనే మనం కొత్త కారును కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా ఈ విషయాలను గుర్తు పెట్టుకొని కారును కొనుగోలు చేయాలి.

సాధారణంగా మనం కారు కొనుగోలు చేయడానికి ముందు కారును టెస్ట్ డ్రైవ్ చేసే సమయంలో అన్ని విషయాలను గుర్తు ఉంచుకుంటాము కానీ మనం పగటిపూట టెస్ట్ డ్రైవ్ చేస్తాము కనుక చాలామంది కారు హెడ్ లైట్ ల గురించి ఆలోచించడం మానేస్తారు. మనం కార్లలో రాత్రిపూట ప్రయాణించే సమయంలో హెడ్ లైట్స్ ఎంతో ముఖ్యమైనవి కనుక తప్పనిసరిగా హెడ్ లైట్స్ ను పరిశీలించాలి. దీనితోపాటు ఏసీ కండిషన్ కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

ఇక చాలామంది కారును తమకు నచ్చిన మోడల్ సెలెక్ట్ చేస్తూ ఉంటారు కానీ కారు కొనుగోలు చేసిన తర్వాత ఆ కార్ మన పార్కింగ్ కి సరిపోతుందా లేదా అనే విషయం మాత్రం ఆలోచించరు అందుకే కారు మనం కొనుగోలు చేసేముందు మన పార్కింగ్ స్థలాన్ని దృష్టిలో ఉంచుకొని కొనుగోలు చేయాలి. మీ అవసరాలకు అనుగుణంగా సీట్లు ఎత్తును సర్దుబాటు చేస్తే నాలుగు వైపులా మీరు స్పష్టంగా చూడగలుగుతున్నారో లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేయాలి.ఇలా కారు కొనుగోలు చేయడానికి ముందు ఈ విషయాలన్నింటినీ కూడా తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకొని కారును కొనుగోలు చేయడం ఎంతో ముఖ్యం.