Pushpa Actor: మాములుగా సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది సెలబ్రిటీలకు కార్ల పిచ్చి ఉంది. మార్కెట్లోకి కొత్త కార్లు వచ్చాయి అంటే చాలు వెంటనే వాటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇంకొందరు కార్ల కలెక్షన్ ఉన్నప్పటికీ కొత్త కొత్త కార్లను కొనుగోలు చేస్తూనే ఉంటారు. అలా ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు వరుసగా ఒకరి తర్వాత ఒకరు లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కూడా పుష్ప సినిమా నటుడు ఒక అరుదైన కారుని కొనుగోలు చేశారు. ఇంతకీ ఆ నటుడు ఎవరు? ఆ కారు ధర ఎంత? ఎలాంటి కారుని కొనుగోలు చేశాడు? ఆ కారు ప్రత్యేకతలు ఏమిటి?అన్న వివరాల్లోకి వెళితే..
ఆ నటుడు మరెవరో కాదు పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న హీరో నటుడు ఫహద్ ఫాసిల్.. మొదట మలయాళంలో హీరోగా కెరియర్ ను ప్రారంభించిన ఆయన విలన్ పాత్రలలో కూడా అద్భుతంగా నటిస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం భాషలలోనూ వరుస సినిమాలతో అలరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక్కో సినిమాకు అత్యధిక పారితోషికం తీసుకుంటున్నారు. అలాగే ఇతర హీరోల మాదిరిగానే ఫహద్ సైతం ఆటో మొబైల్స్ పట్ల విపరీతమైన ఆసక్తి ఉన్న హీరో అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన వద్ద అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి.
తాజాగా మరొక కారు తన గ్యారేజీ లోకి చేరింది. ఇప్పుడు ఫహద్ ఫాసిల్ అరుదైన కారును కొనుగోలు చేసాడు. అతడి గ్యారేజీ లోకి వోక్స్వ్యాగన్ గోల్ఫ్ GTI కారు వచ్చింది. అయితే ఈ కారు సింపుల్ గా కనిపిస్తున్నప్పటికీ ఇందులోని ఫీజర్స్, స్పెషాలిటీస్ తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. భారతదేశంలో కేవలం 150 వోక్స్వ్యాగన్ గోల్ఫ్ GTI కార్లు మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.53 లక్షలు, ఆన్ రోడ్ ధర రూ.60 లక్షల కంటే ఎక్కువ అని చెప్పాలి. కాగా ఈ కారు కేవలం 5 సెకన్లలో 0 నుండి 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుందట. అలాగే ఈ కారులో అద్భుతమైన బ్రేకింగ్ సిస్టమ్, ఇంటీరియర్, భద్రతా వ్యవస్థలు, ముఖ్యంగా వేడి వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి. వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTI కంటే చాలా ఖరీదైన కార్లు ఫహద్ ఫాసిల్ ఇంట్లో ఉన్నాయి. రెండు కోట్ల విలువైన ఫెరారీ 911 సెర్రెరా, ఐదు కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ G63 AMG, నాలుగున్నర కోట్ల విలువైన లంబోర్గిని ఉరుస్, ల్యాండ్ రోవర్ డిఫెండర్ వంటి కార్లు కూడా ఉన్నాయి. అయితే కేవలం ఇవే కాకుండా ఫహద్ వద్ద అనేక చిన్న కార్లు సైతం ఉన్నాయి. మలయాళీ చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోస్ అయిన మమ్ముట్టి, మోహన్ లాల్, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ వద్ద సైతం అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. అలాగే విదేశీ మోడల్ కార్లు, బైక్స్ సైతం ఉన్నాయి.