బెంజ్ కార్ కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. కారు ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

కోలీవుడ్ హాట్ బ్యూటీ నిక్కీ తంబోలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె పలు సినిమాలలో నటిస్తూ భారీ గ్లామర్ షో చేయడంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మ అందాల జాతర మామూలుగా ఉండదు. ఇలా తన గ్లామరస్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేసే నిక్కి తంబోలి బిగ్ బాస్ హిందీ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. బిగ్ బాస్ సీజన్ 14 లో ఈమె మరింత పాపులారిటీ సంపాదించుకుంది.

బిగ్ బాస్ తర్వాత ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఇలా బిగ్ బాస్ ద్వారా ప్రస్తుతం వరుస అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నా నిక్కి తంబోలి ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే తన తండ్రితో పాటు కారు దగ్గర కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పెద్దఎత్తున ఈ ఫోటోలు వైరల్ కావడమే కాకుండా ఎంతో మంది శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఇక ఈమె మెర్సిడెస్‌ బెంజ్‌ జీఎల్‌ఈ మోడల్ కారును కొనుగోలు చేశారు. ఈ కారు ధర సుమారు కోటిన్నర రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. నిక్కీ తంబలి కారు కొన్న విషయాన్ని తెలియజేస్తూ తన తండ్రి తో ఫోటోలు దిగి ఎమోషనల్ పోస్ట్ చేశారు. నన్ను ఎప్పుడు పైకి ఎదగడానికి ఎంతో సపోర్ట్ చేస్తూ కింద పడకుండా సపోర్ట్ ఇచ్చారు. ఎప్పటికీ ఈ విషయంలో నేను ఎంతో అదృష్టవంతురాలని నేను ఎప్పటికీ మీ లిటిల్ గర్ల్ అంటూ ఈమె ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.