Harsha Chemudu: హర్ష అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ.. వైవా హర్ష అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు. మొదట యూట్యూబ్ ద్వారా వెబ్ సిరీస్ ల ద్వారా భారీగా గుర్తింపు తెచ్చుకున్నాడు వైవాహర్ష. వైవా అనే ఒక షార్ట్ ఫిలింతో బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట యూట్యూబర్ గా కెరిర్ ను ప్రారంభించిన అతను ఆ తర్వాత సొంత టాలెంట్ తో ఎదిగి హీరోగా మరి పలు సినిమాలు చేశారు. అయితే మొదట సినిమాలలో హీరో ఫ్రెండ్ గా సపోర్టింగ్ రోల్స్ లో మెరిశాడు. తర్వాత కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలలో నటించి కామెడీతో ప్రేక్షకులలో బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
తర్వాత సుందరం మాస్టర్ సినిమాతో హీరోగా కూడా అదృష్టం పరీక్షించుకున్నాడు. మాస్ మహరాజా రవితేజ నిర్మించిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచినా నటుడిగా మంచి ప్రశంసలు అందుకున్నాడు హర్ష. ఇటీవలే ప్రియదర్శి హీరోగా నటించిన సారంగపాణి జాతకం సినిమాతో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు హర్ష. ఇకపోతే హర్ష సినిమాల సంగతి పక్కన పెడితే.. ఇతనికి కార్లు, బైక్స్ అంటే బాగా పిచ్చి. ఇప్పటికే అతని గ్యారేజ్ లో లగ్జరీ స్పోర్ట్స్ బైక్స్ కూడా ఉన్నాయి. వీలు దొరికినప్పుడు స్పోర్ట్స్ బైక్స్ వేసుకుని ఫ్రెండ్స్ తో కలిసి లాంగ్ డ్రైవ్స్ కి వెళ్తుంటారు.
అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను కూడా ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా హర్ష గ్యారేజ్ లోకి ఖరీదైన లగ్జరీ కారు చేరింది. బీఎండబ్ల్యూ ఎఫ్87 ఎమ్2 కాంపిటీషన్ కారును కొనుగోలు చేశాడు హర్ష. ఈ శుభవార్తను అతనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ సందర్భంగా కొత్త కారు పక్కన తన భార్యతో కలిసి ఫొటోలు దిగి వాటిని ఇన్ స్టాలో షేర్ చేసారు. హర్ష షేర్ చేసిన కార్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు హర్షకు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా హైదరాబాద్ మార్కెట్ లో ఈ కారు ధర రూ.కోటి 30 లక్షల నుంచి రూ.కోటి 40 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ ధర తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.