లోన్ పొందాలనుకునే వారికి తీపికబురు.. సులువుగా రూ.10 లక్షల లోన్ పొందే ఛాన్స్!

మనలో చాలామంది ఏదో ఒక అవసరం వల్ల లోన్ పొందాలని అనుకుంటూ ఉంటారు. కొంతమందికి సులువుగానే లోన్ లభించినా మరి కొందరికి మాత్రం లోన్ లభించదు. అయితే ప్రముఖ పేమెంట్ యాప్స్ లో ఒకటైన భారత్ పే సులభంగా 10 లక్షల రూపాయల వరకు లోన్ ను అందిస్తోంది. ఎవరైతే భారత్ పే యాప్ ను ఉపయోగిస్తున్నారో వాళ్లు సులభంగా ఈ లోన్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. వ్యాపార అవసరాల కోసం ఈ రుణాన్ని తీసుకోవచ్చు.

ఈజీ డైలీ ఇన్‌స్టాల్‌మెంట్ల రూపంలో ఆస్తులు తనఖా పెట్టకుండానే రుణం చెల్లించే అవకాశం ఉండటంతో లోన్స్ పొందాలని భావించే వాళ్లకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. లోన్ టెన్యూర్ 15 నెలల వరకు ఉండగా భారత్ పే హోమ్ పేజ్ లో గెట్ లోన్ అనే ఆప్షన్‌ ను క్లిక్ చేసి వివరాలను నమోదు చేసి లోన్ ను పొందవచ్చు. టెన్యూర్, అమౌంట్ వంటి వివరాలను ఎంటర్ చేసి తక్కువ సమయంలో రుణం పొందవచ్చు.

పాన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్‌లు అప్‌లోడ్ చేయడంతో పాటు కేవైసీ పూర్తి చేసి సెల్ఫీ అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. లోన్ అగ్రిమెంట్ ను పూర్తి చేసి వన్ టైమ్ పాస్ వర్డ్ ద్వారా వెరిఫై చేయించుకోవాలి. ఆర్‌బీఐ అప్రూవ్డ్ లెండింగ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా మీరు భారత్ పే నుంచి రుణాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. తీసుకునే రుణం, వ్యవధి ఆధారంగా వడ్డీ రేటులో మార్పులు ఉంటాయి.

బ్యాంకులలో రుణాలు పొందడంలో ఇబ్బందులు ఎదురైన వారు ఈ రుణం తీసుకుంటే బెనిఫిట్ పొందవచ్చు. నిబంధనలు, షరతులను పూర్తిస్థాయిలో తెలుసుకుని లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. తీసుకున్న మొత్తాన్ని సకాలంలో వడ్డీతో కలిపి తిరిగి చెల్లిస్తే మాత్రమే కొత్త రుణాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.