నిరుద్యోగులకు అదిరిపోయే బంపర్ ఆఫర్.. 8 లక్షల రూపాయల వేతనంతో జాబ్స్!

ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు చదవాలని చాలామంది భావిస్తూ ఉంటారు. పాలిటెక్నిక్ విద్యార్థులు అంది వచ్చిన ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. రాష్ట్రంలోని ప్రముఖ పాలిటెక్నిక్ కాలేజ్ లలో ఎచీవర్స్ డే కార్యక్రమాలు జరుగుతుండగా ఈ కార్యక్రమానికి హాజరైన సాంకతిక విద్యా శాఖ కమీషనర్ నాగరాణి వివిధ ప్రముఖ సంస్థలలో క్యాంపస్ ప్లేస్ మెంట్లు సాధించారని అన్నారు.

క్యాంపస్ ప్లేస్ మెంట్ ల ద్వారా నియామకమైన విద్యార్థులకు వేతనాలు ఎక్కువ మొత్తంగా ఉన్నాయని 3 లక్షల రూపాయల నుంచి 8 లక్షల రూపాయల వరకు వేతనం అందుకున్నారని ఆయన వెల్లడించారు. క్యాంపస్ ప్లేస్ మెంట్ లు విద్యార్థుల నైపుణ్యం, సామర్థ్యాలను పెంచే విధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక విద్యా శాఖ ఆధ్వర్యంలోని ఉపాధి విభాగం ఇందుకు సంబంధించి మెరుగైన పనితీరును ప్రదర్శించిందని వెల్లడించారు.

పాలిటెక్నిక్ పూర్తి చేసుకున్న ప్రతీ విద్యార్థికి ఉద్యోగం కల్పించటమే ధ్యేయంగా ముందడుగులు వేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. దేశంలోని ప్రముఖ సంస్థలలో ఈ నియామకాలు జరిగినట్టు పేర్కొన్నారు. జాబ్ మార్కెట్ డిమాండ్స్ కు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దామని ఆమె చెప్పుకొచ్చారు. నిరుద్యోగులకు పాలిటెక్నిక్ చదివినా అదిరిపోయే జాబ్ ఆఫర్స్ వస్తున్నాయని నాగరాణి తెలిపారు.

చాలామంది పాలిటెక్నిక్ చదువును చిన్న చదువుగా భావిస్తున్నారు. అయితే ఉన్నత చదువులు చదవలేని స్థిత్ ఉన్నవాళ్లకు పాలిటెక్నిక్ మంచి ఆప్షన్ అవుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. అయితే ఇతర ఉద్యోగ ఖాళీలతో పోల్చి చూస్తే ఐటీఐ చదివిన కొంతమందికి మాత్రం వేతనాలు తక్కువగానే ఉంటాయి.