నిరుద్యోగులకు తీపికబురు.. పదో తరగతి అర్హతతో 1832 అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు!

రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 1832 ఉద్యోగ ఖాళీల కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. యాక్ట్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. 2023 సంవత్సరం జనవరి 1వ తేదీ నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2023 సంవత్సరం డిసెంబర్ నెల 9వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. పదో తరగతి, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. www.rrcecr.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

పదో తరగతితో పాటు ఐటీఐలో సంబంధిత ట్రేడ్ లో శిక్షణ తీసుకున్న వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఫిట్టర్, వెల్డర్, మెకానిక్ ఉద్యోగ ఖాళీలతో పాటు మెషినిస్ట్, పెయింటర్, కార్పెంటర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంఎంటీఎం, ఎలక్ట్రీషియన్, వైర్ మ్యాన్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని భోగట్టా.

రిఫ్రిజినేషన్ అండ్ ఏసీ మెకానిక్, టర్నర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, బ్లాక్ స్మిత్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫోజర్ అండ్ హీట్ ట్రీటర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉండనుందని సమాచారం అందుతోంది.