ఇంటర్ అర్హతతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ లో భారీగా జాబ్స్.. మంచి వేతనంతో?

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 1526 పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్, అస్సాం రైఫిల్స్ విభాగాల్లోని వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. జులై 8వ తేదీ వరకు ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తుండటం నిరుద్యోగులకు ప్లస్ అవుతోంది.

rectt.bsf.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. జులై 8వ తేదీ వరకు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సబ్ ఇన్‌స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్, వారెంట్ ఆఫీసర్, హవల్దార్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్), హవిల్దార్ (క్లార్క్) ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తారని తెలుస్తోంది.

కనీసం ఇంటర్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. 8 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మాజీ సైనికులకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయని తెలుస్తోంది. వివరాలను ఎంటర్ చేసి, డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజును చెల్లించడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు 100 రూపాయలు దరఖాస్తు ఫీజు కాగా మహిళలు, రిజర్వ్‌డ్ కేటగిరీ వారు, మాజీ సైనికులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదని సమాచారం అందుతోంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించి స్కిల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 25,500 రూపాయల నుంచి 81,100 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.