ఇంటర్ పాసైన వాళ్లకు తీపికబురు.. రూ 1,12000 వేతనంతో భారీగా ఉద్యోగ ఖాళీలు?

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో పని చేయాలని భావించే వాళ్ల కోసం వేర్వేరు జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా వర్క్‌షాప్, వెటర్నరీ స్టాఫ్, లైబ్రేరియన్‌ ఉద్యోగ ఖాళీలతో పాటు పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 141 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ మొదలు కాగా bsf.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2024 సంవత్సరం జూన్ 16వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన అన్ని అర్హతలను కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులభంగానే దరఖాస్తు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

నోటిఫికేషన్ ప్రకారం వయోపరిమితిని కలిగి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. జనరల్ అభ్యర్థులకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి 100 రూపాయలు దరఖాస్తు ఫీజు కాగా మిగతా అభ్యర్థులకు మాత్రం ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, వైద్య పరీక్ష, సర్టిఫికెట్ల పరిశీలన, ఇతర పరీక్షల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎంపిక ప్రక్రియ జరగనుంది.

rectt.bsf.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులభంగా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు చేసిన ఫారమ్ ను సేవ్ చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 1,12,000 రూపాయల వేతనం లభించనుందని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.