కొబ్బరి నూనెతో చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోండిలా?

కొబ్బరి నూనెను వివిధ రకాల స్వీట్స్, వంటకాల తయారీలో, తల వెంట్రుకలకు మర్దన చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే నాచురల్ కొబ్బరినూనె చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.కొబ్బరినూనె జిగట ద్రవపదార్థం మన శరీరంలో సహజంగా ప్రవహించే సెబమ్ ను పోలి ఉంటుంది. అలాగే కొబ్బరి నూనెలోని లోరిక్ యాసిడ్ మోనో లోరిన్‌గా పరివర్తన చెంది చర్మ కణాలకు హాని చేసే బ్యాక్టీరియా, వైరస్‌లతో సమర్థవంతంగా పోరాడి అనేక చర్మ సమస్యలను నయం చేస్తుందని చర్మ వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

సాధారణంగా కొబ్బరి నూనె జుట్టుకు మంచి కండిషనర్ లాగా ఉపయోగపడి జుట్టు మృదువుగా, దృఢంగా
ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తుంది. అలాగే నాణ్యమైన కొబ్బరి నూనెకు టేబుల్ స్పూన్ పసుపు కలిపి వారానికి ఒకసారి ముఖంపై మర్దన చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను తగ్గించ‌డంతో పాటు మొటిమల వ‌ల్ల వ‌చ్చే మచ్చలను కూడా తగ్గిస్తుంది.

ఒక టేబుల్‌స్పూను తాజా కొబ్బరి నూనెలో, ఒక టీస్పూన్‌ బేకింగ్‌ పౌడర్‌లను కలిపి ముఖానికి మృదువుగా పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకుంటే కొబ్బరి నూనెలో ఉన్నటువంటి లారిక్ ఆమ్లం ,యాంటీఆక్సిడెంట్లు చర్మంను పొడిబారకుండా మృదువుగా ఉంచడంతోపాటు బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది.

ఒక టేబుల్‌ స్పూన్ గానుగ పట్టి తీసిన తాజా కొబ్బరి నూనెను తీసుకొని అందులో అర టేబుల్‌స్పూన్ నిమ్మరసం,ఒక టేబుల్‌స్పూన్ పెరుగును బౌల్లో వేసి బాగా కలిపి ముఖానికి మృదువుగా పట్టించి కొన్ని నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖంపై జిడ్డు తొలగి ఆరోగ్య వంతమైన, కాంతివంతమైన చర్మం మీ సొంతమవుతుంది

వారానికి ఒకటి లేదా రెండుసార్లు కొబ్బరి నూనెలో పంచదార కలిపి ముఖంపై బాగా మర్దన చేయాలి. తర్వాత కొన్ని నిమిషాలకు చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మృత కణాలు తొలగి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అలాగే చర్మ ముడతలు కూడా తగ్గించుకోవచ్చు.

తీవ్రమైన వేడి కారణంగా సున్నితమైన చర్మం పొడి వారి చర్మకణాలు నశిస్తాయి. కొబ్బరి నూనెతో మన చర్మంపై మర్దన చేసుకుంటే కొబ్బరి నూనె గొప్ప శరీర మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇది మీ చర్మాన్ని రిపేర్ చేస్తుంది చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.

కొబ్బరి నూనెను చర్మ సౌందర్యానికి వాడాలనుకుంటే రసాయనాలు కలపని శుద్ధమైన గానుగ పట్టిన నేచురల్ కొబ్బరినూనె వాడడం మంచి ఫలితాలను ఇస్తుంది.