బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి ఈ సంస్థ భారీ సంఖ్యలో దరఖాస్తులను స్వీకరిస్తోంది. 20 రీజినల్ రిలేషన్ షిప్ ఆఫీసర్/ డిప్యూటీ రీజినల్ రిలేషన్ షిప్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 2023 సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డ్ నుండి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. https://bobfinancial.turbohire.co/job/publicjobs/th%2ft4y3itd2ea2fl3wvl__msn4hpj_mjtf2mspobvfpjke2vovppy6lvgsf1ckot లింక్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకోవచ్చు.
2023 సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీ నాటికి 45 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉన్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజును చెల్లించాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు మన దేశంలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుంది.
రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ మొదలైన నేపథ్యంలో అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగాలకు వేతనం కూడా భారీ రేంజ్ లో ఉండనుందని సమాచారం అందుతోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది.