ఈ ఆలయాన్ని దర్శించుకుంటే సొంతింటి కల నెరవేరుతుందా.. కోరికలు తీర్చే భూవరాహ స్వామి!

చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు సొంతిల్లు లేనివాళ్లు ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. సొంతింటి కలను నెరవేర్చుకోవడం కోసం డబ్బులను కూడబెడుతున్న వాళ్లు దేశంలో చాలామందే ఉన్నారు. అయితే ఒక ఆలయాన్ని దర్శించుకోవడం ద్వారా సొంతింటి కల తీరడంతో పాటు కోరిన కోరికలు నెరవేరతాయి. కర్ణాటక రాష్ట్రంలోని వరాహనాథ కల్లహళ్లిలో ఉన్న భూవరాహ స్వామి ఆలయంకు ఏకంగా 3,000 సంవత్సరాల చరిత్ర ఉంది.

గౌతమ మహర్షి హేమవతీ నదీ ఒడ్డున 3,000 సంవత్సరాల క్రితం ఈ ఆలయంలో స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారట. ఆ విగ్రహం శిథిలావస్థకు చేరుకున్న సమయంలో మూడో వీరభళ్లాల అనే రాజు ఈ విగ్రహానికి పూర్వ వైభవం తెచ్చారు. పదేళ్ల క్రితం ఒక భక్తుడు శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడు. ఇంటి నిర్మాణం కోసం స్థలం కొనాలని భావించే వాళ్లు మట్టిని, స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వాళ్లు ఇటుకలను పూజిస్తారు.

ఈ పూజల తర్వాత ఆ మట్టి, ఇటుకలను ఇంటి నిర్మాణంలో వినియోగిస్తారు. ఈ విధంగా చేయడం ద్వారా దేవుని అనుగ్రహం తమపై ఉంటుందని భక్తులు నమ్ముతారు. రేవతీ నక్షత్రం రోజున ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలతో పాటు ప్రత్యేక అభిషేకాలను నిర్వహిస్తారు. రైలు, బస్సు మార్గాల ద్వారా సులువుగా ఈ ఆలయాన్ని దర్శించుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

బెంగళూరు, మైసూర్ నుంచి ఈ ఆలయానికి ప్రత్యేకంగా బస్సులు ఉంటాయి. ఈ దేవుడు చాలా పవర్ ఫుల్ అని భక్తులు భావిస్తారు. ఈ ఆలయాన్ని దర్శించుకునే అవకాశం ఉంటే అస్సలు మిస్ చేసుకోవద్దని పండితులు సైతం చెబుతున్నారు. సొంతింటి కల తీరాలంటే ఈ ఆలయాన్ని వెంటనే దర్శించుకుంటే మంచిది.