దేశంలో ప్రతి సంవత్సరం కోట్ల సంఖ్యలో విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారు. అయితే ఇంజనీరింగ్ చదివిన వాళ్లలో ఉద్యోగం సాధించిన వాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. బీటెక్ డిగ్రీ ఉన్నా ఆ డిగ్రీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే బీటెక్ డిగ్రీ ఉన్నవాళ్లకు బెనిఫిట్ కలిగే విధంగా వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ నిరుద్యోగులకు బెనిఫిట్ కలిగేలా తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 428 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. bel-india.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
కనీసం 55 శాతం మార్కులతో బీటెక్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2023 సంవత్సరం మే నెల 18వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు చివరి తేదీగా ఉండగా ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు 32 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు అర్హులు కాగా ఇతర ఉద్యోగాలకు 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు అర్హత కలిగి ఉంటారు.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులకు గరిష్టంగా 55,000 రూపాయల వరకు వేతనం లభించనుంది. https://www.bel-india.in/ లింక్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దర్ఖాస్తు చేసుకోవచ్చు. https://www.bel-india.in/documentviews.aspx?filename=english%20final%20pe%20te-3-5-2023.pdf లింక్ ద్వారా జాబ్ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.