ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని కిడ్నీలో రాళ్ల సమస్య వేధిస్తుండగా ఈ సమస్య వల్ల దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధ పడేవాళ్లు విపరీతమైన నొప్పితో ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్య బారిన పడిన వాళ్లను పొత్తి కడుపులోంచి నొప్పి పొడుచుకొస్తూ వస్తూ బాధ పెడుతుంది. యూరిన్ కు వెళ్లిన సమయంలో మంట ఎక్కువగా ఉంటుంది.
నీళ్లు తక్కువగా తాగడం, యూటీఐ, విటమిన్ బి6, సి లోపం, విటమిన్ డి ఎక్కువగా ఉండటం వల్ల ఈ సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది. మద్యం ఎక్కువగా తాగుతున్నా, ఆలస్యంగా భోజనం చేస్తున్నా కూడా ఈ సమస్య బారిన పడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ సమస్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆపరేషన్ చేయించుకుని రాళ్లను కరిగించుకోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు.
డాండెలైన్ ఒక ఆయుర్వేద మూలిక కాగా మూత్ర నాళంలో క్రిస్టల్ డిపాజిట్లను తగ్గించడంలో ఇది తోడ్పడుతుంది. డాండెలైన్ టీను తరచుగా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు కచ్చితంగా సులభంగా కరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కిడ్నీ సమస్యల ముప్పును తగ్గించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. రోజుకు 6 నుంచి 8 గ్లాసుల నీళ్లు తాగితే కిడ్నీలో రాళ్ల సమస్యలు దూరమవుతాయి.
దానిమ్మ రసం, నిమ్మరసం, సూప్ వంటి లిక్విడ్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా కిడ్నీలో రాళ్ల సమస్యకు చెక్ పెట్టవచ్చు. తులసి టీలో ఎసిటిక్ యాసిడ్ ఎక్కువగా ఉండగా చిన్న సైజ్‌లో ఉన్న రాళ్లను ఇది సులభంగా కరిగిస్తుంది. తులసిలోని యాంటీ-లిథియాసిస్ లక్షణాలు రాళ్ల పరిమాణాన్ని విచ్ఛిన్నం చేయడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. యాపిల్ సైడర్ వెనిగర్ సైతం కిడ్నీలోని రాళ్లను కరిగించడంలో తోడ్పడుతుంది.