మనలో చాలామంది దంతాల విషయంలో ఎంతో కేర్ తీసుకుంటూ ఉంటారు. నోటి పరిశుభ్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే తగ్గుతాయని చెప్పవచ్చు. దంతాలు పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉండాలంటే షుగర్ క్యాండీలు, ఐస్ లాంటి వాటికి దూరంగా ఉంటే మంచిది. కాఫీలు, పుల్లటి సిట్రస్ డ్రింకుల వల్ల కూడా దంతాలకు హాని కలుగుతుంది.
నిద్రలో పళ్లు కొరికే అలవాటు ఉన్నవాళ్లు వెంటనే వైద్యులను సంప్రదించే అవకాశాలు ఉంటాయి. మౌత్ వాష్ ను వాడేవాళ్లు థెరపిక్ మౌత్ వాష్ ను వాడితే మంచిది. పంటి గార, దంత క్షయాన్ని అరికట్టడంలో ఇవి తోడ్పడతాయి. ఫ్లెక్సిబుల్ బ్రష్‌ను వాడటం ద్వారా దంతాల సమస్యలకు చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. దంతాలు ఝుమ్మని లాగుతుంటే యాంటీ సెన్సిటివిటీ ఉన్న టూత్ పేస్ట్ లను వాడాలి.
దంతాలు తెల్లగా మెరవడానికి డెంటిస్ట్‌లు సూచించే పేస్ట్ లను వాడటం ఉత్తమమని చెప్పవచ్చు. రోజుకు రెండుసార్లు రెండు నిమిషాల చొప్పున బ్రష్ చేయాలి. దంతాల బయటివైపు, లోపల, నమిలే భాగాల్లో బాగా బ్రష్ చేస్తే మంచిది. బ్రష్‌ను నిలువుగా ఉంచి, కిందకు మీదకు కదుల్చుతూ దంతాలను శుభ్రం చేసుకోవాలి. నాలుకను శుభ్రం చేయాలని భావించే వాళ్లు టంగ్ క్లీనర్ ను వాడాలి.
దంతాల మధ్య ఏదైనా ఇరుక్కుంటే వెంటనే వాటిని త్గొలగించుకోవాలి. స్ట్రింగ్ ఫ్లాస్, టైనీ బ్రష్‌లను వాడటం ద్వారా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. ఫ్లాసింగ్ చేయడం వల్ల పంటి గార, దంతాల మధ్య ఇరుకున్న ఆహారాన్ని సులువుగా తొలగించుకునే అవకాశాలు ఉంటాయి. వాటర్ పిక్ సహాయంతో దంతాల మధ్య ఇరుక్కున్న ఆహారాన్ని సులువుగా తొలగించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.