షుగర్ (రక్తంలో చక్కెర) ను తగ్గించడానికి, మీరు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు, అధిక ఫైబర్ ఉన్న ఆహారాలు, మరియు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. బ్రోకలీ, దోసకాయలు, బెల్ పెప్పర్స్, క్యారెట్లు, ఉల్లిపాయలు, పుట్టగొడుగులు, ఆస్పరాగస్, సెలెరీ షుగర్ ను తగ్గించే విషయంలో తోడ్పడతాయి. బ్రౌన్ రైస్, క్వినోవా, ఓట్స్, క్రాకర్స్ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.
గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పండ్లు ఆరోగ్యానికి మేలు చేసే విషయంలో సహాయపడతాయి. బ్రౌన్ రైస్, క్వినోవా, ఓట్స్, బీన్స్, పెసర, ఆపిల్, బొప్పాయి ఎక్కువగా ఫైబర్ ను కలిగి ఉంటాయని చెప్పవచ్చు. లీన్ మీట్స్, చేపలు, బీన్స్, గుడ్లు షుగర్ ను కంట్రోల్ లో ఉంచడంలో సహాయపడతాయి. షుగర్ ఉన్నవాళ్లు ఉప్పును పరిమితంగా తీసుకుంటే మంచిది.
క్రమం తప్పకుండా భోజనం చేయడం రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి సహాయపడుతుంది. టీ, కాఫీల స్థానంలో లెమన్ టీ, అల్లం టీ వంటివి తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. వ్యాయామం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. పండ్లు, కూరగాయలు విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి, ఇవి షుగర్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారం షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. ఈ ఆహారాలను తీసుకోవడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ నెమ్మదిగా రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. చికెన్, మటన్, బీఫ్ లో గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. కోడిగుడ్లు సైతం తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆకు కూరలు తీసుకుంటే మంచిది.