బాదం రోజు తినేవారు తప్పనిసరిగా ఈ విషయాలు తెలుసుకోవాలి

బాదం అంటే ఇష్టం ఉండని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరు బాదంను చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే అందులో ఉన్న పోషకాలు అలాంటివి. మనలో చాలామంది ప్రతిరోజు బాదంను తింటారు కానీ వాటిలో ఉన్న పోషకాల గురించి కానీ వాటిని ఎలా తినాలి అనే అంశంపై మాత్రం అవగాహన ఉండదు. ఒకవేళ మీరు ప్రతిరోజు బాదంను తింటున్నట్టయితే ఈ ఆర్టికల్ మీకోసమే. అలాగే తినని వారు ఈ ఆర్టికల్ చదివిన తరువాత ఖచ్చితంగా తింటారు.

బాదంలో ఉండే పోషకాలు మరియు ఉపయోగాలు:

* బాదాం లో మోనో అన్శాచురేటెడ్ యాసిడ్స్ ఉంటాయి. అవి ఒక రకమైన ఫ్యాటి యాసిడ్స్. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండాచేస్తాయి.

*బాదాంలో మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం, కాపర్, మాంగనీస్, అర్జినైన్ ఉంటాయి. అంతేకాకుండా
బాదాంలో లో డెన్సిటీ లైపోప్రోటీన్ కొలెస్ట్రాల్ ని తగ్గించే గుణాలున్నాయీ . బాదం తింటే క్యాన్సర్ వచ్చే
అవకాశాలు కూడా బాగా తక్కువ.

* బాదంను చాలా మంది పొట్టుతోనే తింటారు కానీ అలా తినకూడదు. నాలుగు నుండి ఎనిమిది గంటల
వరకు నానబెట్టి పొట్టు తీసేసిన బాదం తినడం మంచిది .అలా చేయడం వలన శరీరానికి పోషకాలు
సరిగ్గా అందుతాయి . చలికాలంలో అయితే రోజుకి 5లేదా 6 బాదం పప్పులు తినాలి . వేసవి లో అయితే
3లేదా 4 బాదం పప్పులు తీసుకోవాలి .

* బాదం వల్ల శరీరంలో వున్న గ్లూకోజ్ లెవెల్ బాలన్స్ అవుతుంది . అంతేకాకుండా బ్లడ్, షుగర్ లెవెల్స్,
ఇంకా డయాబెటిస్ కూడా కంట్రోల్ లో ఉంటుంది .

* బాదంలో ఉండే విటమిన్ ఇ వల్ల చర్మానికి కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి . యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని
యువీ రేస్ నుండి, పొల్యూషన్ నుండి రక్షిస్తాయి . అలాగే స్కిన్ క్యాన్సర్ కూడా రాదు. బాదం క్రమం
తప్పకుండా తీసుకోవడం వల్ల యాంటీ ఏజింగ్ లక్షణాలు కనిపించవు. అలాగే చర్మ సంబంధిత సమస్యలు
కూడా వచ్చే అవకాశాలు చాలా తగ్గుతాయి .

* బరువు తగ్గాలనుకునే వారు కూడాప్రతిరోజు బాదంను తినడం వల్ల లాభం కనిపిస్తుంది. బాదం లో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల అతిగా తినడం నియంత్రింణలోకి వచ్చి బరువు కూడా తగ్గుతారు . అందుకే స్నాక్ రూపంలో కూడా బాదం తీసుకోవచ్చు .బాదం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది .

*బాదం వల్ల ఎముకలు బలంగా ఉండడంతో ఎముకలకి సంబంధించిన ఫ్యాక్చర్ అయ్యే అవకాశాలు తక్కువగా
ఉంటాయి . ఇంకా పళ్ళు కూడా పాడుకాకుండా బాదం కాపాడుతుంది .బాదం నూనె వాడటం వల్ల జుట్టు
కూడా ఆరోగ్యంగా ఉంటుంది .

ఇన్ని పోషకాలు ఉన్న బాదంను మెనూలో చేర్చుకొని ఆరోగ్యాన్ని పెంచుకుందాం. మీకు తెలిసిన వాళ్లను కూడా బాదం యొక్క పోషకాల గురించి, ఉపయోగాలు గురించి తెలియజేయండి.