బ్యాంక్ ఆఫ్ బరోడా సూపర్ స్కీమ్.. డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే భారీ మొత్తంలో వడ్డీ పొందే ఛాన్స్!

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా డబ్బులు దాచుకునే వాళ్లకు ప్రయోజనం చేకూరే విధంగా అదిరిపోయే స్కీమ్ ను ప్రకటించింది. మాన్‌సూన్ ధమాకా పేరుతో రెండు కొత్త డిపాజిట్ పథకాలను ఈ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి ఏకంగా 7.65 శాతం వడ్డీతో ఈ స్కీమ్ అమలు కానుందని సమాచారం అందుతోంది.

ఈ స్కీమ్ లో 333 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ కు ఏకంగా 7.15 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది. మరో డిపాజిట్ స్కీమ్ లో 399 రోజులకు 7.25 శాతం వార్షిక వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా సీనియర్ సిటిజన్లను ఏడాదికి ఏకంగా 7.75 శాతం వడ్డీ లభిస్తుందని సమాచారం అందుతోంది. సీనియర్ సిటిజన్లకు ఎక్కువ బెనిఫిట్ కలిగే విధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేట్లు ఉన్నాయి.

ఈ స్కీమ్ గురించి పూర్తిస్థాయిలో అవగాహన తెచ్చుకుని ఇన్వెస్ట్ చేయడం ద్వారా భారీ మొత్తంలో బెనిఫిట్ పొందే అవకాశం అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎక్కువ సంవత్సరాల పాటు డిపాజిట్ చేస్తే మరింత ఎక్కువ వడ్డీ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వేవేరు టెన్యూర్లలో స్పెషల్ డిపాజిట్ స్కీమ్స్ ను బ్యాంక్ ఆఫ్ బరోడా అమలు చేస్తోంది.

ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు నియమ నిబంధనలను పూర్తిగా తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే మంచిది. 666 రోజుల డిపాజిట్లకు 7.15%, 777 రోజుల డిపాజిట్లకు 7.25% లభిస్తున్న నేపథ్యంలో లాంగ్ టర్మ్ డిపాజిట్లపై దృష్టి పెట్టడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.