ప్రముఖ బ్యాంక్ లలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా డబ్బులను పొదుపు చేయాలని భావించే వాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. లాక్ పతి పేరుతో బ్యాంక్ ఆఫ్ బరోడా సూపర్ స్కీమ్ ను అమలు చేస్తోంది. నెలకు 1000 రూపాయలు చెల్లించడం ద్వారా 81 నెలలు పొదుపు చేస్తే ప్రయోజనం చేకూరుతుంది. 81 నెలలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ.1,01,761 పొందే అవకాశం ఉంటుంది.
1000 రూపాయలు కాకుండా ఎక్కువ మొత్తం ఈ స్కీమ్ లో డిపాజిట్ చేస్తే 5 సంవత్సరాల కంటే తక్కువ సమయంలోనే లక్ష రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. సమీపంలోని బ్యాంక్ అఫ్ బరోడా బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయడం ద్వారా కచ్చితమైన రాబడిని పొందవచ్చు.
ఈ స్కీమ్ వల్ల మహిళలు ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ బెనిఫిట్ పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సీనియర్ సిటిజన్లకు సాధారణ వ్యక్తులతో పోల్చి చూస్తే ఎక్కువ మొత్తం బెనిఫిట్ లభించే అవకాశాలు అయితే ఉంటాయి. బెస్ట్ సేవింగ్ ప్లాన్ కావాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిది. కస్టమర్లు ఎక్కువ మొత్తం ఖర్చు లేకుండానే బ్యాంక్ ఆఫ్ బరోడా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడా లాక్ పతి స్కీమ్ ఇప్పటికే ఎంతోమంది జీవితాలను మార్చేసిన స్కీమ్ కాగా ఇన్వెస్ట్ చేసేవాళ్లు ఈ స్కీమ్ కు సంబంధించిన నియమ నిబంధనలను పూర్తిస్థాయిలో తెలుసుకుని పెట్టుబడులు పెడితే మంచిదని చెప్పవచ్చు. ఈ స్కీమ్ వల్ల దీర్ఘకాలంలో భారీ లాభాలు సొంతమవుతాయి.