నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. ప్రముఖ బ్యాంక్ లో ఏకంగా 627 ఉద్యోగాలు!

ఐబీపీఎస్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ జాబ్ నోటిఫికేషన్స్ ను మరవక ముందే బ్యాంక్ ఆఫ్ బరోడా భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 627 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

జులై 2వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉందని సమాచారం అందుతోంది. bankofbaroda.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలలో 459 సీట్లను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనుండగా మిగతా ఉద్యోగ ఖాళీలను మాత్రం రెగ్యులర్‌ విధానంలో భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది.

ఏడాది కాంట్రాక్ట్ పీరియడ్ తో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. రెగ్యులర్ జాబ్స్ స్పెషలిస్ట్ కేటగిరీ కింద ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తారు. కార్పొరేట్ & ఇన్‌స్టిట్యూషనల్ క్రెడిట్ & ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

బ్యాంక్ వెబ్ సైట్ లో హోమ్‌పేజీలో కనిపించే అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి అప్లికేషన్ ఫీజు చెల్లించి ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 600 రూపాయలు కాగా మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉండనుంది.