నెలకు రూ.5 వేల పెట్టుబడితో రూ.కోటి పొందే అవకాశం.. ఏం చేయాలంటే?

ప్రస్తుత కాలంలో తెలివిగా ఇన్వెస్ట్ చేస్తే మాత్రమే కళ్లు చెదిరే స్థాయిలో ఆదాయం సొంతమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. పిల్లల పేరుపై కోటి రూపాయలు పొదుపు చేయాలని భావించే వాళ్లు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. నెలకు రూ.5 వేలు చొప్పున ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా కోటి రూపాయల మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఎంచుకునే ఆప్షన్ ఆధారంగా పొందే రాబడిలో మార్పులు ఉంటాయి.

 

దీర్ఘకాలం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కాంపౌండింగ్ బెనిఫిట్ తో కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు సొంతమవుతాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే కనీసం 12 శాతం రాబడిని పొందే అవకాశాలు అయితే ఉంటాయి. 20 సంవత్సరాల పాటు నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే రూ.50 లక్షలు పొందవచ్చు. పెట్టిన పెట్టుబడికి 3 రెట్ల ఆదాయం పొందే అవకాశం అయితే ఉంటుంది.

 

పెట్టుబడిని మరో ఐదేళ్లు పొడిగించుకుంటే ఏకంగా 94 లక్షల రూపాయలు సొంతమవుతాయి. కాంపౌండింగ్ వడ్డీ పొందే అవకాశం ఉండటంతో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు తక్కువ సమయంలోనే రెట్టింపు అవుతాయి. మ్యూచువల్ ఫండ్స్ గురించి పూర్తిస్థాయిలో అవగాహనను ఏర్పరచుకుని ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే బెనిఫిట్స్ ను పొందవచ్చు.

 

రిటర్న్ శాతం పెరిగితే మరింత ఎక్కువ మొత్తం పొందే అవకాశం అయితే ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ గురించి పూర్తిస్థాయిలో తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే కచ్చితంగా భారీ మొత్తంలో బెనిఫిట్ లభిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంక్ లను సంప్రదించడం ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు.