మనలో చాలామంది డెబిట్, క్రెడిట్ కార్డులను కలిగి ఉంటారు. అయితే ఈ కార్డుల వల్ల ఉన్న ప్రయోజనాల గురించి చాలామందికి పూర్తిస్థాయిలో తెలియదు. ఏటీఎం కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ 10 లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. కనీసం 50,000 రూపాయల నుంచి గరిష్టంగా 10 లక్షల రూపాయల వరకు ఏటీఎం కార్డును కలిగి ఉన్నవాళ్లు బీమా పొందే అవకాశం అయితే ఉంటుంది.
క్రెడిట్, డెబిట్ కార్డులను కలిగి ఉండటం ద్వారా అనేక ప్రయోజనాలను సైతం పొందవచ్చనే సంగతి తెలిసిందే. ఏటీఎం కార్డులను కలిగి ఉన్నవాళ్లకు ఆయా బ్యాంకులు బీమా సౌకర్యాన్ని కల్పిస్తాయి. అయితే ఈ విషయాలకు సంబంధించి అవగాహన కలిగి ఉన్నవాళ్లు చాలా తక్కువమంది కావడంతో ఈ విషయాలు చాలామందికి తెలియవు. బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నవాళ్లు ఈ విషయాలపై అవగాహన కలిగి ఉంటే వాళ్లకు ఎంతో మేలు చేకూరుతుంది.
ఏదైనా ప్రమాదం వల్ల ఆస్పత్రిపాలు కావడం లేదా మృతి చెందితే కార్డుదారులు లేదా నామినీ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. కార్డ్ ఆధారంగా చేసే లావాదేవీల ఆధారంగా పొందే బెనిఫిట్స్ విషయంలో మార్పులు ఉంటాయని సమాచారం. బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ గా ఉన్నవాళ్లు మాత్రమే ఈ ప్రయోజనాలను పొందడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు.
సమీపంలోని బ్యాంక్ ను సంప్రదించి ఏటీఎం కార్డ్ ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ ను పొందవచ్చనే ప్రశ్నకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ కార్డ్ బెనిఫిట్స్ కు అర్హత కలిగి ఉన్నవాళ్లు సరైన డాక్యుమెంట్లను జత చేయడం ద్వారా ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.