ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా ప్రధానంగా వృద్ధులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. 70 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లో చేరవచ్చు. ఎక్కువ వైద్య ఖర్చుల వల్ల ఎవరూ పేదరికంలోకి వెళ్లకూడదనే మంచి ఆలోచనతో ఈ స్కీమ్ అమలు కానుంది.
కేంద్ర ప్రభుత్వం అలాంటి వాళ్లకు ఆర్థిక భద్రతతో పాటు నాణ్యమైన వైద్య సేవలను అందించనుంది. ఏకంగా 4.5 కోట్ల కుటుంబాలు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఈ స్కీమ్ ద్వారా ఏకంగా ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి చేకూరనుంది. ఈ స్కీమ్ వల్ల కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున ఫ్రీ ఆరోగ్య బీమా కవరేజీ లభించనుంది.
నాన్-ఇంటెన్సివ్, ఇంటెన్సివ్ కేర్ సేవలు, రోగనిర్ధారణ, వసతితో పాటు వైద్య పరీక్షలు, చికిత్స, మెడికల్ ఇంప్లాంటేషన్, ఆహారం, నాన్-ఇంటెన్సివ్ ఇతర ప్రయోజనాలను ఈ స్కీమ్ ద్వారా పొందవచ్చు. ఇప్పటికే ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు ఆరోగ్య బీమాపై 5 లక్షల రూపాయల అదనపు టారిఫ్ పొందే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నవాళ్లకు సైతం ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేయాలని భావించే వాళ్లు అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎంజేఏవై కియోస్క్ కు వెళ్లడం ద్వారా వెరిఫికేషన్ చేయించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కుటుంబ గుర్తింపు పత్రాలను సమర్పించడం ద్వారా అర్హతలను నిర్ధారించవచ్చు. గుర్తింపు పతాలను ధృవీకరించిన తర్వాత వాళ్లకు పీఎంజేఏవై ఐడీని కేటాయించడం జరుగుతుంది.